11న అల్పపీడనం..మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్నటి ఉత్తర – దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడిందని… ఈ రోజు తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి / షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 2.1 కిమీ నుండి 5.8 కిమీ మధ్య వుందని పేర్కొంది వాతావరణ శాఖ. అంతేకాదు.. అల్పపీడనం ఈ నెల 11వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం & వాయువ్య బంగాళా ఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర ఏర్పడే అవకాశం వుందని తెలిపింది.

దీంతో.. ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో ఎల్లుండి అనేక ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా.. ఈ నెల 11వ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావం వలన తెలంగాణా, ఏపీ రాష్ట్రాలలో 11,12,13 తేదీలలో విస్తారంగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ శాఖ… కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జాలర్లను వేటకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news