తెలంగాణ లో నేడు కొన్ని ప్రాంతల్లో భారీ వర్షాలు..రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతం లో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద అల్పపీడనం ఏర్పడిందని దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువతకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు తెలిపింది. అదేవిధంగా అల్పపీడన ప్రాంతం నుండి ఒడిశా మీదుగా తెలంగాణ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది.
దాని ప్రభావం తో నేడు భారీ వర్షాలు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా నిన్న కూడా రాష్ట్రం లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నల్గొండ,. మెదక్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అంతే కాకుండా హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.