Tollywood drugs case: డ్రగ్స్ కేసు.. సినీ ఇండస్ట్రీనే కాదు..పాలిటిక్స్‌ను కూడా షేక్ షేక్ చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. ఇప్పటికే ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, రవితేజ, నవదీప్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణలో వారి లావాదేవీలపై ఆరా తీసింది. ఈ క్రమంలో నేడు హీరో తరుణ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్ ను ఈడీ ప్రశ్నించనున్నారు.
ఇదే కేసులో తరణ్ ను 2017 లోనే ఎక్సైజ్ శాఖ విచారించింది. ఆసమయంలో ఆయన బయో షాంపుల్స్ ను ఎక్సైజ్ శాఖకు ఇచ్చాడు. తరుణ్ బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రీపోర్ట్ ఇచ్చింది. అనంతరం సినీ ప్రముఖులకు ఎలాంటి సంబంధం లేదంటూ ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కెల్విన్ ఇచ్చిన వివరాల మేరకు తరుణ్ ను ఎక్సైజ్ శాఖ విచారించనున్నది. ఎఫ్ లాంజ్ క్లబ్ , కెల్విన్ తో ఉన్న సంబంధాల పై ఆరా తీయనున్న ఈడీ.
మరోవైపు.. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నవదీప్, తనీశ్, ముమైత్ ఖాన్, నందు, తరుణ్, రవితేజ, ఆయన డ్రైవరు, ఎఫ్ క్లబ్ మేనేజర్ లకు కెల్విన్ తో సంబంధం లేదని తేల్చి చెప్పింది.