ఆసియా కప్ లో ఈ రోజు నేపాల్ ఇండియా లు తలపడుతున్నాయి. కానీ మ్యాచ్ మొదలైనప్పటి నుండి వర్షం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంది. నేపాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 38వ ఓవర్లో దాదాపుగా ఒక గంట పాటు అంతరాయం కలిగించింది. ఎలాగు నేపాల్ బ్యాటింగ్ పూర్తి అయ్యేలా అవకాశం ఇచ్చింది వర్షం. నేపాల్ బ్యాటింగ్ లో 230 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఛేదనలో ఇండియా ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగానే మళ్ళీ వర్షం తళుక్కున ప్రత్యక్షము అయింది. రోహిత్ మరియు శుబ్ మాన్ గిల్ లు ఓపెనర్లుగా రాగా కేవలం 2 .1 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది. ప్రస్తుతం ఇండియా వికెట్ ఏమీ కోల్పోకుండా 17 పరుగులు చేసింది. ఇక వర్షం హెవీ గా కురుస్తోంది..
మెయిన్ పిచ్ పైన మరియు మిగిలిన చోట్ల కూడా కవర్ చేశారు. మరి మిగిలిన ఓవర్లు ఇండియా ఆడేందుకు సాధ్యంగా ఉంటుందా లేదా పాకిస్తాన్ తో లాగానే మ్యాచ్ రద్దవుతుందా తెలియాలంటే మరికొంచెం సేపు వెయిట్ చేయాల్సి ఉంది.