రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

-

రెండు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. బుధవారం మహబూబ్ నగర్, వికారాబాద్,రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గురువారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మే 12న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మే 15 వరకు వాతావరణం కాస్త చల్లగానే ఉంటుందని, మే 20 తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news