నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

-

పిడుగులు.. ఉరుములు.. మెరుపులతో తెలుగు రాష్ట్రాల వణికిపోయాయి. గత రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కురుస్తున్న వానల వల్ల పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల నష్టపోయామని వాపోతున్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాలు గత రెండ్రోలుగా వర్షాలతో వణికిపోతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. ముఖ్యంగా తెలంగాణలో గరిష్ఠంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో  13.6 సెంటీమీటర్ల వాన కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి.  5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈదురు గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో వాన కురుస్తుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news