చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..!

-

చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సభలో ప్రతిపాదించారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం చెత్త సేకరించడానికి పన్ను విధించింది. సర్వీస్ ప్రొవైడర్లు ద్వారా వాహనాలు ఏర్పాటు చేసి 40 మున్సిపాలిటీల్లో పన్నులు వసూలు చేసింది. చెత్తను సేకరించడానికి నెలకి 51,641రూపాయల నుంచి 62,964 రూపాయల వరకూ చెల్లించేది. విశాఖ ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో శ్పాప్, గుంటూరు ,అనంతపురం రెడ్డి ఎంటర్ప్రైజెస్ కి చెత్త సేకరణ కు ఇచ్చారు. 40 మున్సిపాలిటీలలో నెలకి 13.9 కోట్లకి ఇచ్చారు.

2021 లో నవంబర్ నుంచి చెత్త పన్ను కలెక్ట్ చేయడం ప్రారంభించారు. నెలకి గృహాలకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు సేకరించారు. వాణిజ్య సముదాయాలకు నెలకు 100 నుంచి 10,000 వరకు సేకరించారు. ఆస్తి పన్ను 50 రూపాయలు ఉన్నవారికి కూడా చెత్త పన్ను సంవత్సరానికి 356 రూపాయలు వేశారు. 2021 నవంబర్ నుంచి జూలై వరకు 325 కోట్లు బిల్లు అయితే 249 కోట్లు చెల్లించారు. 2014_2019 మధ్య ఐదు టీడీపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ట్యాక్స్ లు పెంచలేదు. గత ప్రభుత్వం వేసిన చెత్త పన్ను పైన కొన్ని జిల్లాలు మహిళ ధర్నాలు చేశారు. కొన్ని ప్రాంతాలలో చెత్త పన్ను చెల్లించలేదని త్రాగునీటిని నిలిపివేశారు. ప్రతి శనివారం చెత్త పన్ను సేకరించినందుకు వాలంటీర్లు డ్రైవ్ నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రజా అభిప్రాయాలు తెలుసుకోకుండా చెత్త పన్ను వేశారు. అయితే మేము చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చాము అని మంత్రి నారాయణ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version