తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు నిధులపై కీలక ప్రకటన

-

తెలంగాణ రైతులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. మరో వారంలో నిధులు సమకూరుతాయని.. అప్పుడే రైతు నిధులు వస్తాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

ఈ మేరకు తెలంగాణ విద్యార్థి, ఉద్యమ నాయకుడైన మాదాసు శ్రీనివాస్ గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు కార్యవర్గ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.

బాయిల కాడ మోటారు పెడితే 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సీఎం కేసీఆర్ గారు బాయికాడ మోటార్లను పెట్టేది లేదని, రైతులకు కష్టం తెచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారని మంత్రి హరీశ్ వెల్లడి. ఎఫ్ సీఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని నిప్పులు చెరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version