రైతుబంధు : నిన్న‌ 18.12 ల‌క్ష‌ల రైతులు.. నేడు రెండు ఎక‌రాల రైతుల‌కు

-

రైతుబంధు ప‌థ‌కం నిధులు రైతుల ఖాత‌లో మంగ‌ళ‌వారం నుంచి జ‌మ అవుతున్నాయి. తొలి రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 544.55 కోట్ల ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. 18.12 ల‌క్ష‌ల మంది రైతు ఖాతాల‌ల్లో ఈ మొత్తం జ‌మ అయింది. కాగ మంగ‌ళ వారం ఎక‌రం, ఎక‌రంలోపు ఉన్న రైతుల ఖాత‌ల‌లో రైతు బంధు డ‌బ్బుల‌ను జ‌మ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎక‌రాల వ‌ర‌కు భూమి ఉన్న రైతుల ఖాత‌లో రైతు బంధు నిధులు జ‌మ కానున్నాయి.

కాగ ప్ర‌స్తుతం ఎనిమిదో విడితగా రైతు బంధు ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఎనిమిదో విడిత లో తెలంగాణలో మొత్తం 66.61 ల‌క్ష‌ల మంది రైతులకు రైతు బంధు ప‌థ‌కం అమ‌లు అవుతుంది. దీని కోసం రూ. 7,645.66 కోట్ల‌ను ఇప్ప‌టి కే తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించింది. అలాగే రైతు బంధు ప‌థ‌కం ప్రారంభం అయిన నాటి నుంచి రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్లు ను జ‌మ చేసిన‌ట్టు తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news