తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నవతెలంగాణ పదవ వార్షికోత్సవం సభలో పాల్గొని అ ఆ లు రాను వారు కూడా మేము మీడియా అని చెప్పుకుంటున్నారని అలాంటివారీ వల్ల మీడియాకు గౌరవం లేకుండా పోతుందని తెలిపారు. సోషల్ మీడియా వ్యక్తుల పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టారు.
“ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్ది పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఏకదం విభజించి పాలించడమే.. ఈ కుటీల పన్నాగాలను సమాజం సహించదు” అని ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి.