తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి చిత్రంతో చరిత్ర సృష్టించి డైరెక్టర్ రాజమౌళి. రాజమౌళి దొరకడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక వరమని చెప్పవచ్చు. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో పరాజయం అన్నది లేకుండా ఉంది. దర్శకుడిని ఒక స్టార్ హీరో చెప్పారంటే నమ్మగలమా..? కానీ ఇది వాస్తవమే అన్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమా స్టోరీ తో ఆ స్టార్ హీరో కలయిక లో అగ్రహీరో గా కుదరదని చెప్పారట. ఆ హీరో ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రాజమౌళి డైరెక్షన్ లో చేయాలని ఎంతో మంది అగ్ర హీరోలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటిది గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హీరోగా నటించిన పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లగా ఆయన నో చెప్పారట. సై వంటి చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత డైరెక్టర్ రాజమౌళిని చూసి అందరూ గర్వపడుతున్నారు. సై సినిమా లో పవన్ కళ్యాణ్ నటించనని తెలియజేయడానికి వివిధ కారణాలు ఉన్నాయట.
అందుకు కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉండడం చేత.. పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీగా లేకపోవడం , అంతేకాకుండా రాజమౌళి కెరియర్ ఇంకా అప్పటికే ఊపు అందుకుంటున్న నేపథ్యంలో సమయం తీసుకోవచ్చు అని.. బ్యాక్ డ్రాప్ కథ కావడంతో పవన్ కళ్యాణ్ కి కథ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి పలు కారణాలు అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ తో పని చేయాల్సిన సై సినిమా మిస్సైంది. గతంలో రాజమౌళి ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో హీరో నితిన్ కు అవకాశం రావడంతో ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాడు రాజమౌళి. రాజమౌళి కెరీర్లో 13 సినిమాలు తెరకెక్కించగా.. అన్నీ సంచలన విజయాలు అందుకున్నాయి.