రాజమౌళి పెద్ద తప్పు చేస్తున్నాడా…?

-

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఎప్పుడు ఈ సినిమా విడుదల అవుతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో రాజమౌళి కి తల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు యోధులు… అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పేర్లతో సినిమాను తీసుకొస్తున్నారు. ఈ ఇద్దరు కూడా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారి మీద పోరాటం చేసారు. కాని ఒకరితో ఒకరికి సంబంధం లేదు. దీనితో రాజమౌళి ఇద్దరినీ కలిపి ఈ సినిమా చేస్తున్నాడు.

రాజమౌళి వాళ్ల పేరు పెట్టుకొని ఈ సినిమాను ఫిక్షన్‌గా తెరకెక్కిస్తున్నానని చెప్పడంతో ఈ సినిమా పై కాపీ రైట్ ఇష్యూ వచ్చే అవకాశ౦ ఉందని అంటున్నారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వారసులు కూడా ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసే సూచనలు కనపడుతున్నాయి. వారి కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చినా ఆశ్చర్యం లేదు. దీనితో ఇప్పుడు ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version