నా మొద‌టి మూవీకి ఇలాంటి హీరో దొరికాడేంటి.. ఎన్టీఆర్‌పై జ‌క్క‌న్న వ్యాఖ్య‌లు

-

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రియు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి మెద‌టి సారి న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో ఈ సినిమా జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్నారు.

ఇక జ‌క్క‌న్న ఏ సినిమా తీసినా హిట్టే అవుతుంది. మ‌రి ఈయ‌న సినీ ప్ర‌స్థానం ఎక్క‌డ మొద‌లైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టూడెంట్‌ నెంబర్‌ 1 చిత్రంతో మెగాఫోన్‌ చేతపట్టిన ఆయన హిట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకొన్నాడు. తాను విజయం అందుకోవడమే కాదు… ప్రతి చిత్రంతోనూ తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వ‌చ్చాయి. అయితే తాజాగా రాజమౌళి ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త‌న మొద‌టి సినిమా స్టూడెంట్‌ నెంబర్ 1 గురించి.. ఎన్టీఆర్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట పెట్టారు.

ఎన్టీఆర్ ఫ‌స్ట్‌ సినిమా స్టూడెంట్ నెంబర్-1 చేసేటప్పుడు అతనికి 19 ఏళ్లు ఉండేవి. చాలా లావుగా ఉండేవాడు. సరిగ్గా మీసాలు కూడా లేవు. ఎలాంటి పర్సనల్ మెయిన్‌టైనింగ్ లేదు. అప్పుడు నాకేంటి మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడని చాలా ఫీల్ అయ్యాను. అయితే అది మొద‌టి సినిమానేగా అనుకుని సినిమాను ప‌ట్టాలెక్కించారు. కానీ, సినిమా సెట్స్‌పై ఉన్న‌ప్పుడు ఇంటెర్వెల్ సీన్స్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు.. ఇత‌ను ఖ‌చ్చితంగా పెద్ద స్టార్ అవుతాడ‌ని.. అత‌ని లోపల ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉంద‌నుకున్నాని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news