రాజమౌళి సక్సెస్ ఫార్ములా అదేనా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీకి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన డైరెక్టర్లలో దర్శకుడు రాజమౌళి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈయన తీసే ప్రతి సినిమా కూడా రికార్డులను సైతం సృష్టించి మంచి విజయాన్ని అందిస్తూ ఉంటుంది. రాజమౌళి తెరకెక్కించే ఏ సినిమా అయినా సరే మరొక సినిమాకు సంబంధం ఉండదని చెప్పవచ్చు. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో కేవలం 12 సినిమాలను మాత్రమే తెరకెక్కించారు . ఈ సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి. ఇక తను తెరకెక్కించే సినిమాలలో కొత్త నటీనటులను తీసుకొని కూడా మంచి విజయాలను అందుకున్నారు రాజమౌళి.

అయితే రాజమౌళి డ్రీమ్ మాత్రం మహాభారతం సినిమా అని చెప్పవచ్చు.. అయితే ఈ సినిమాలోని కథలో నటీనటులు సైతం చాలా ప్రతిభావంతులైన వారిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి తండ్రి తన సినిమాలకు కథలు రాయడంతో ఏరి కోరి కథలను ఎంచుకుంటూ ఉంటారు రాజమౌళి. ముఖ్యంగా రాజమౌళి సక్సెస్ కు కారణం ఇదే తొలిమెట్టు అని చెప్పవచ్చు. ఇక కొత్త సినిమాలో తప్పనిసరిగా ఎమోషన్ ఉండేలా చూసుకోవడం.. సినిమా ప్రజెంటేషన్ విషయంలో తగిన నియమాలు పాటిస్తూ ఉంటారు రాజమౌళి. అందుచేతనే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించేలా కనిపిస్తూ ఉంటాయి.

ఇక అంతే కాకుండా ప్రేక్షకుల మైండ్ కు బాగా కనెక్ట్ అయ్యేలా అందులోని పాత్రలను చేస్తూ ఉంటారు. ఇక రాజమౌళి ఎక్కువగా తన సినిమాలో హీరోకు సమానంగా ఉండే విలన్ పాత్రలని ఎంచుకొని మంచి గుర్తింపు తెస్తూ ఉంటారు. ముఖ్యంగా విలన్ ను చూపించే విధానంలో ఏ డైరెక్టర్ కూడా ఈయనకు సాటి రారని చెప్పవచ్చు. అందుచేతనే ఎక్కువగా ఈయన సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఎంత సమయం తీసుకున్నా సరే పాత్రను క్రియేటివిటీ చేయడం రాజమౌళి కే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అందుచేతనే రాజమౌళి తీసే ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ దగ్గర షేక్ చేస్తూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news