తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు కన్ఫామ్ అయ్యినట్టే. ఈనెల 31న పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నారు రజనీ. ఐతే..ఇంతలోనే పార్టీ గుర్తుపై చర్చ మొదలైంది. అభిమాన సంఘాలు రజనీకి రెండు గుర్తులను ప్రతిపాదిస్తున్నాయి. రజనీ బాబా భక్తుడైనందుకు బాబా సినిమాలో చూపిన ముద్ర చిహ్నాన్ని పార్టీ గుర్తుగా ఎంపికచేస్తారని మక్కల్ మండ్రం నేతలు చెబుతున్నారు. ఇటీవల పోయెస్ గార్డెన్ లో మీడియా ప్రతినిధుల సమావేశం ముగిసిన తర్వాత రజనీ బాబా ముద్రను చూపెట్టారు.
దాంతో దాన్నే సింబల్‌గా ప్రకటించాలని అభిమానులు కోరుతున్నారు. ఐతే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించే గుర్తుల జాబితాలో బాబా ముద్రను పోలిన ఎటువంటి గుర్తులు లేవు. దీంతో బాబా ముద్రకు ఈసీ అనుమతివ్వకపోవచ్చని అంటున్నారు. మరో పక్క పాలమ్మే వ్యక్తిగా సైకిల్‌పై తిరుగుతూ రజనీ పాడిన పాట చాలా పాపులర్. దీంతో పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు. ఒకరకంగా ఆ ముద్ర దొరకకపోవడం అంటే షాక్ అని చెప్పక తప్పదు.