మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకున్న రాజశేఖర్ కూతురు శివాని!

-

మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనవలసిన ప్రముఖ హీరో రాజశేఖర్ కూతురు,నటి శివాని పోటీల నుంచి తప్పుకున్నారు. మిస్ ఇండియా పోటీల్లో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. దీనికి గల కారణాన్ని కూడా తెలియజేశారు.” నాకు పరీక్షలు (మెడికల్ థియరీ) ఉండడంతోపాటు, మలేరియా రావడం వల్ల ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్, సబ్ కాంటెస్టులో పాల్గొనలేకపోయా. అయినా మునుపటిలాగే ప్రయత్నించాలనుకున్నా. కానీ అది సాధ్యపడలేదు.

నా ప్రాక్టికల్ ఎగ్జామ్ అనుకున్న తేదీ కంటే ముందుగానే మొదలయ్యాయి. అంతేకాదు మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే రోజున (జులై 3)న నాకు ఎగ్జామ్ ఉంది. దీంతో మిస్ ఇండియా ప్రయాణాన్ని కొనసాగించలేక పోతున్నా” అని శివాని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన శివాని మిస్ ఇండియా పోటీలకు మాత్రం తమిళనాడు కేటగిరీలో ఎంపికయ్యారు. ఇప్పుడు ఇలా అనూహ్య ప్రకటన చేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news