బిగ్‌ బాస్‌ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు

-

బిగ్‌ బాస్‌ షో పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతాల మధ్య విభేధాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్ షో ను వెంటనే బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ రాజసింగ్ డిమాండ్‌ చేశారు. బిగ్‌ బాస్‌ షో ద్వారా ఆంధ్ర, తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతుందని ఆయన నిప్పులు చెరిగారు. బిగ్ బాస్‌ షో పై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ కి రిక్వెస్ట్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులతో కలసి షో చూడలేని పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. సల్మాన్‌ ఖాన్ షో లో హిందువుల మనోభావాలను కించపరిచారని రాజాసింగ్‌ గుర్తు చేశారు. వ్యాపారం ముసుగు లో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాసింగ్‌. కమిషనన్లు తీసుకుని అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. ఇక నైనా ఇలాంటి షోలు రాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కాగా.. యాంకర్‌ రవి ఎలిమినేషన్‌ పై అతని ఫ్యాన్స్‌ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news