బీజేపీలో అలా కుదరదు… కుటుంబ రాజకీయాలపై పోరాడాలి : ప్రధాని నరేంద్ర మోదీ

-

బీజేపీలో కుటుంబ రాజకీయాలకు స్థానం లేదని.. బీజేపీ పార్టీల అలా కుదరదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు అనుమతించమని… వివిధ పార్టీల్లో ఉన్న విధంగా వంశ రాజకీయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎంపీల పిల్లలకు టికెట్లు రాకపోవడానికి కారణం తానేనని.. తనదే బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించినందుకు.. ఢిల్లీలో పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీని, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను సత్కరించారు.

ఇటీవల విడుదలైన ‘ ది కాశ్మీర్ ఫైల్స్‘  సినిమాను ప్రధాని మెచ్చుకున్నారని.. ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చిన బూత్ లను గుర్తించి దానికి కారణాలను తెలుసుకోవాలని ప్రధాని, పార్టీ నాయకులతో అన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విదేశాంగా మంత్రి జై శంకర్ ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయును తరలింపు ‘ ఆపరేషన్ గంగ ’ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారని తెలుస్తోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version