టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు !

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు… పెద్ద తలకాయలు ఉన్నాయని పేర్కొన్న ఆయన… ఈడీ విచారణలో రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సాండ్, ల్యాండ్,డ్రగ్స్ మాఫీయా నడిపిస్తుందని ఆరోపణలు చేశారు.. సంజయ్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది… ప్రజలు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.

ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం పోతుంది… పేద ప్రజల బీజేపీ సర్కార్ వస్తోందన్నారు. హుజూరాబాద్ ఎన్నిక జరగకుండా సీఎస్ తో సీఎం కేసీఆర్‌…. తప్పుడు సమాచారం పంపించారని ఆరోపించారు. అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీ నే అని స్పష్టం చేశారు. నాలుగు పార్టీ లు మారే అలవాటు తమ బండి సంజయ్ కి లేదని… ఓటు కి నోటు కేసులో జైలు కి పోయే అలవాటు బీజేపీ కి లేదని తెలిపారు.  రూ. 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నారని ఆ పార్టీ వాళ్లే ఆరోపిస్తున్నారని రేవంత్‌ రెడ్డి పై పరోక్షంగా ఆరోపణలు చేశారు. బండి సంజయ్ బండి కి అడ్డువస్తే పగిలిపోతుందని హెచ్చరించారు.