సీఎం జగన్ ను కలిసిన మంచు మనోజ్…

టాలీవుడ్‌ స్టార్‌, యంగ్‌ హీరో మంచు మనోజ్‌… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్‌… స్వయంగా చెప్పారు. ఈ మేరకు మంచు మనోజ్‌.. ఓ ట్వీట్‌ కూడా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విజనరీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ని కలుసు కోవడం గౌరవంగా ఉందని ట్వీట్‌ చేశారు మంచు మనోజ్‌.

” దూరదృష్టి గల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ను కలవడం గౌరవంగా మరియు విశేషంగా ఉంది. భవిష్యత్తు తరాల కోసం సీఎం జగన్‌ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన నిర్ణయాలు ప్రజలందరికీ ఆశాజనకంగా ఉంటున్నాయి. భగవంతుని దయ జగన్‌ పై ఉండాలని…ఆయన ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. సీఎం జగన్‌ పరిపాలనకు శుభాకాంక్షలు.” అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. మా అసోసియేషన్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్‌ ను మంచు మనోజ్‌ కలవడంపై రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.