మనము రోజుకి ఒక విదేశీ మరియు స్వదేశీ ప్రేమకథను గురించి తెలుసుకోవలసి అవస్తోంది. ఇప్పటికే మన ఇండియాలో మూడు ప్రేమకథలు సోషల్ మీడియాలో పరిచయాలు వలన జరిగాయి. అయితే మూడు కథలలో అమ్మాయిలు అందరూ విదేశీయులు కావడం ఒక విచిత్రం అయితే.. వీరంతా కూడా అబ్బాయికోసం ఇండియాకు తెగించి వచ్చి ఇక్కడ వారితో ఉన్నారు. కాగా ఇప్పుడు మనము చెప్పుకునే కథలో ఇండియా అమ్మాయి పరదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ శిఖర్ జిల్లాకు చెందిన ఒక అమ్మాయి పాకిస్తాన్ యువకుడిని ఇంస్టా గ్రామ్ పరిచయం వలన ప్రేమలో పడి అతని కోసం పాకిస్తాన్ కు వెళ్లడానికి మాస్టర్ ప్లాన్ వేసింది.
పాకిస్తాన్ కు వెళ్ళడానికి బ్యాగ్ తో సహా జైపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది, లాహోర్ కు వెళ్లాలని టికెట్ అడగడంతో అవాక్కయిన అధికారులు. పూర్తి వివరాలను ఆరాతీయగా లవర్ కోసం వెళుతున్నట్లు చెప్పడంతో పేరెంట్స్ కు సమాచారం అందించారు.