రాజస్థాన్ జోధ్ పూర్ లో ఘర్షణలు… రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి

-

రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జోధ్ పూర్ పట్టణంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నగరంలోని బల్ముకంద్ బిస్సా సర్కిల్ లో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఓ వర్గం వారు కాషాయ జెండాను ఎగవేశారు. అయితే ఈ జెండాను మరో వర్గం వారు తొలగించి ఇస్లామిక్ జెండాను ఎగరవేశారు. దీంతో జలోరి గేట్ ప్రాంతంలో ఘర్షణలు ఏర్పడ్డాయి. రెండు వర్గాల మధ్య సోమవారం అర్థరాత్రి రాళ్లదాడి చెలరేగింది. దీంతో పోలీసులు రెండు వర్గాల వారికి నచ్చచెప్పడంతో ఉద్రిక్తత తొలిగింది. 

తాజాాగా మంగళవారం రంజాన్ పర్వదినం సందర్భంగా మరోసారి ముస్లింలు తమ నిరసన తెలియజేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పరస్థితిని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సమీక్షిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news