ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి రజనీకాంత్ ఈ రోజు సోషల్ మీడియాలో స్పందించారు. తన పేరుతో వైరల్ అవుతున్న లెటర్ నకిలీ అని పేర్కొన్నారు. తాను అలాంటి నోట్ రాయలేదని పేర్కొన్నారు. అయితే, తన ఆరోగ్య పరిస్థితి గురించి వార్తాకథనాలు నిజమని ఆయన అంగీకరించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ తను రాసింది కాదని అయితే అందులో తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్త నిజమేనని స్పష్టం చేశారు. దీని గురించి మక్కల్ మండ్రం బృందంతో చర్చిస్తాను. రాజకీయాలపై నా వైఖరి గురించి తగిన సమయంలో ప్రజలకు తెలియజేస్తాను`అని తమిళంలో ట్వీట్ చేశారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆయనని వైద్యులు ఆరోగ్య పరిస్థితిని బట్టి బహిరంగ ప్రదేశంలోకి వెళ్లరాదని, అలాగే సామూహిక కార్యక్రమాలు జరిగే చోట ప్రజలతో సంపూర్ణ దూరం పాటించాలని సూచించారట. గతంలో రజనీ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సింగపూర్‌లో వైద్యం చేయించారు. ఆ కారణాల దృష్ట్యా రజనీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సామూహిక కార్యక్రమాలకు కొంత కాలం దూరంగా వుండాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి రజనీ పార్టీని ప్రారంభించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని తమిళనాట జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
— Rajinikanth (@rajinikanth) October 29, 2020