చెడు అలవాట్ల నుంచి నన్ను కాపాడింది ఆమే అంటున్న రజినీకాంత్..!

-

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ బస్ కండక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి అనతి కాలంలోనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అంటే ఆయన ఇమేజ్ వెనుక ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఇదిలా వుండగా చెడు అలవాట్ల నుంచి తనను కాపాడింది తన భార్య లతా అంటూ అభిమానుల ముందు అలాగే మీడియా ముందు ప్రస్తావించారు.. ఎప్పుడు కూడా తన భార్యను పొగుడుతూ ఉండే రజనీకాంత్ ఈసారి కూడా తన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజాగా చెన్నైలో వైజీ మహేంద్రన్ చారుకేసి కార్యక్రమం 50వ రోజు సంబరాలు జరిగాయి. ఆ వేడుకలో భార్య లతతో కలిసి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చే రోజులలో తనకున్న చెడు అలవాట్ల గురించి కూడా వివరించారు.. తాను కండక్టర్ గా పనిచేసే రోజుల్లో మద్యపానం, సిగరెట్లు , మాంసాహార అలవాట్లు ఉండేవని.. నటుడిగా కెరియర్ ప్రారంభించిన మొదట్లో కూడా ఈ అలవాట్లు కొనసాగేవి అని వివరించారు. అయితే కేవలం లతా వళ్లే వాటిని మానేసినట్లు కూడా ఆయన తెలిపారు.

తనకు లతను పరిచయం చేసిన వైజీ మహేంద్రన్ కు జీవితాంతం రుణపడి ఉంటాను అని కూడా ఆయన తెలిపారు. రోజు ఎన్ని సిగరెట్లు తాగి పడేసే వాడినో లెక్క కూడా ఉండేది కాదు. మాంసాహారం తోనే నా రోజు మొదలయ్యేది. రోజు కనీసం రెండుసార్లు మాంసాహార భోజనం లేనిదే నాకు ముద్ద దిగదు. అంతలా నా జీవితం మారిపోయింది. కానీ నా భార్య లత నా ఆరోగ్య విషయంలో కీలకపాత్ర పోషించింది. ఆమె కేవలం తన ప్రేమతో మాత్రమే నేను వాటిని మానేసేలా చేసింది. ఇప్పుడు క్రమశిక్షణతో జీవించేలా నన్ను మార్చింది అంటూ ఆ సభలో వివరించారు రజినీకాంత్.

Read more RELATED
Recommended to you

Latest news