రజినీకాంత్ 169 వ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ తోనే..

-

ఏ విషయంలోనైనా సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైలే వేరు.తాజాగా తన 169 వ చిత్రంపై వస్తున్న రూమర్స్ గురించి తలైవా స్పందించారు.విజయ్ “బీస్ట్” సినిమా విడుదలకు ముందే సూపర్ స్టార్ రజినీకాంత్ 169వ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే.దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో ని కూడా విడుదల చేశారు.అయితే బీస్ట్ మిశ్రమ స్పందనల కే పరిమితం కావడంతో రజిని తన తదుపరి ప్రాజెక్టు విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి.తలైవా 169 వ చిత్రం వేరే దర్శకునితో చేయాలనుకుంటున్నారని నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగింది.

ఈ ఊహాగానాలకు రజిని తనదైన శైలిలో చెక్ పెట్టారు.ట్విట్టర్లో తన ఖాతాకు నెల్సన్ తో రానున్న సినిమా వీడియో లోని ఫోటో నే కవర్ పేజీగా పెట్టారు.దీంతో తన నిర్ణయం మారలేదని అభిమానులకు సందేశం ఇచ్చినట్లయింది.కాగా..నెల్సన్ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనున్న తలైవా 169 వ చిత్రంలో రజిని న్యూ లుక్ లో కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news