భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న రాత్రి టెహ్రాన్ కు చేరుకున్నారు. అక్కడ ఆయన ఇరాన్ రక్షణ శాఖ అధికారులను కలిసే అవకాశం ఉంది. దే విధంగా ద్వైపాక్షిక రక్షణ సంబంధాలపై చర్చించనున్నారు. మూడు రోజుల రష్యా పర్యటనను ముగించిన తరువాత రాజనాథ్ సింగ్ మాస్కో నుండి నేరుగా టెహ్రాన్ చేరుకున్నారు, మాస్కో లో ఆయన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.
రష్యా, చైనా మరియు మధ్య ఆసియా దేశాల నుండి వచ్చిన సహచర దేశాలతో మంత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శుక్రవారం జరిగిన ఎస్సీఓ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. పెర్షియన్ గల్ఫ్ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని, పరస్పరం ఉన్న గౌరవం ఆధారంగా చర్చల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయన సూచనలు చేసారు.