RAKUL PREETH SINGH: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీతి సింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్‌ ప్రీతి సింగ్‌.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌ లోని స్టార్‌ హీరోల పక్కన ఛాన్స్‌ కొట్టేసి… వాహ్‌ అనిపించింది. అయితే..ఇవాళ రకుల్‌ ప్రీతి సింగ్‌ పుట్టిన రోజు.

ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్‌ కు ఓ శుభవార్త చెప్పింది రకుల్‌ ప్రీతి సింగ్‌.   త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తన ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. జాకీ బగ్నానితో పెళ్లి చేసు కోబోతున్నట్లు ప్రకటించేసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్. ఈ ఏడాది తనకు అతి పెద్ద గిఫ్ట్‌ జాకీ బగ్నాని అని రకుల్‌ పేర్కొంది. జాకీ బగ్నాని రాకతో తన జీవితం కలర్‌ ఫుల్‌ కానుందంటూ ఎమోషనల్‌ అయింది రకుల్‌ ప్రీతి సింగ్‌. కాగా.. ఇటీవలే రకుల్‌ నటించిన కొండ పొలం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news