బ్రేకింగ్ : మా ఎన్నికల పోలింగ్ సమయం పొడగింపు

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ను మరో గంట పొడిగించారు ఎన్నికల అధికారి. ప్యానెల్‌ మెంబర్స్‌ ప్రకాశ్‌ రాజ్‌ మరియు మంచు విష్ణు తో మాట్లాడి ఎన్నికల అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అధికారి తాజా నిర్ణయం తో మధ్యాహ్నం రెండు గంటల కు ముగియాల్సిన పోలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.

maa elections

ఇక అటు ఇప్పటి వరకు మా అధ్యక్ష ఎన్నికల్లో 491 మంది ఓటు వేశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయి లో 56 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. కాగా… అంతకు ముందు రిగ్గింగ్ జరిగినట్లు మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు… ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  కాగా..  మా అసోషియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోలింగ్‌ శాతం కూడా పెరుగుతోంది. చాలా మంది నటీ నటులు మా అసోషియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ లో పాల్గొంటున్నారు.