నయనతారకు బిగ్ షాక్..ఆ మూవీ నుంచి ఔట్

-

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి.. అందం, అభినయంతో యువతను ఆకట్టుకున్న ఈమె కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో హీరోయిన్గా నటిస్తోంది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాలలో శశికాంత్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ కథాచిత్రం గా తెరకెక్కుతున్న ఇందులో నటుడు మాధవ్, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే తాజాగా కొన్ని కారణాల వల్ల నయనతారను చిత్ర బృందం పక్కన పెట్టిందట. నయనతార స్థానంలో రాశిఖన్నాను ఫైనల్ చేసిందని సమాచారం అందుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version