రామ్ చరణ్ బర్త్ డే.. కామన్ డీపీ రిలీజ్

-

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘కామన్ డీపీ’ని రిలీజ్ చేసింది.’ఇండియా సినిమాకి గేమ్ ఛేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేశాం. తన అభిరుచి, నిబద్ధతతో మెగాస్టార్ లెగసీని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లారు’ అని ట్వీట్లో పేర్కొంది. కాగా, ఆయన ఫ్యాన్స్ అంతా తమ సోషల్ మీడియా డీపీలో ఈ పోస్టర్ను ఉంచనున్నారు.

కాగా, గేమ్ చేంజర్ రాంచరణ్ నటిస్తున్నటువంటి 15వ చిత్రం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించినటువంటి పొలిటికల్, డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news