రామ్ చరణ్ లుక్ లీక్…!

-

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా షూటింగ్ ని ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. దీనితో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వస్తుంది ఈ చిత్రం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక లుక్ బయటకు వచ్చింది. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా తెలుగులో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బ్రిటీష్ సైనికాధికారి పాత్ర‌లో చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియాభ‌ట్ క‌న‌ప‌డుతున్నారు.

మ‌రి ఈ ఫొటోలు ఎవరైనా లీక్ చేసారా లేక అవి ఎవరైనా ఫాన్స్ చేసారా అనేది స్పష్టత లేదు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న ప‌ది భాష‌ల్లో సినిమా విడుదల అవుతుంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version