కామన్ ఫ్రెండ్ పార్టీ ద్వారా పరిచయమైన ఉపాసన, రాంచరణ్ సుమారుగా ఏడు సంవత్సరాలపాటు ఇష్టపడి ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. నిజానికి వీరి ఎంగేజ్మెంట్ జరిగే ఏడాది వరకు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించలేదని చెప్పాలి. ఇక అప్పటివరకు స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఒక్కసారిగా ప్రేమికులుగా మారిపోయారు.. నిజానికి ఉపాసన కంటే ముందే రాంచరణ్.. తన అలవాట్లను , మంచితనాన్ని ఇష్టపడి ఉపాసనకు ప్రపోజ్ చేయగా.. ఆమె కూడా రామ్ చరణ్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది. ఇలా ఇద్దరి కుటుంబ సభ్యుల సఖ్యతతో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇకపోతే తాజాగా రాంచరణ్ తన భార్య ఉపాసన పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక ఉపాసన గురించి రాంచరణ్ మాట్లాడుతూ.. ఉపాసన కుటుంబం చాలా పెద్దది.. ఇక ఆమె తన కుటుంబంతో ఉండే సత్సంబంధాల కారణంగా మా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది. నిజానికి మా నాన్నతో కాసేపు మాట్లాడాలంటే నాకు భయమేస్తుంది.. కానీ ఆమె తన మామయ్యతో గంటల తరబడి జోకులు వేస్తూ తెగ మాట్లాడేసుకుంటూ ఉంటారు.. ఇక ఉపాసన తెలుగు కిచిడీ లాంటిది.. ఆమెకు తెలుగు నేర్పే ప్రయత్నం చేస్తున్నాను అంటూ రాంచరణ్ తెలిపారు. నిజానికి ఉపాసన వ్యక్తిత్వం పరంగా చాలా మంచిది.. నాకంటే నా కుటుంబంతోనే ఎక్కువగా ఆమె సన్నిహితంగా ఉంటుంది.. ఇక నా కుటుంబంలోని వారు కూడా ఉపాసన ఒక్క క్షణం లేకపోతే ఆమె కోసం ఎదురుచూస్తారు అంతలా నా కుటుంబంతో కలిసిపోయింది.
ఉపాసన నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం.. నిజానికి సినిమా వాళ్లు అన్న తర్వాత రోజుకొక రూమర్ పుట్టుకొస్తుంది. కానీ అలాంటి రూమర్స్ వల్ల నా భార్య ఇబ్బంది పడకూడదు అని వాటికి నేను దూరంగా ఉంటాను. ఈ విషయాన్ని మా నాన్నను చూసి నేర్చుకున్నాను అంటూ రామ్ చరణ్ తెలిపారు. అంతేకాదు తాను సినిమాలలో ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి కూడా కారణం తన భార్య ఉపాసన అంటూ వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ అభిమానులు వదినమ్మ చాలా గ్రేట్ అంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఇక అపోలో వైస్ చైర్మన్ గా పని చేస్తున్న ఉపాసన ఎంతో మంచి మనసున్న అమ్మాయి.. ఎంతోమందికి డబ్బు సహాయం చేయడమే కాకుండా ఎన్నో వృద్ధాశ్రమాలను కూడా నడుపుతోంది .ఇక కరోనా సమయంలో ఎంతోమందికి ఉచిత వైద్యం కూడా అందించింది.