తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనలో సస్పెన్షన్ వేటుకు గురైన ఆసుపత్రి సూపరింటెండెంట్, హైకోర్టును ఆశ్రయించారు. ఆసుపత్రికి తాను తాత్కాలిక ఇంచార్జ్ ని మాత్రమేనని చెబుతున్నారు. నాటి ఘటనతో తనకు సంబంధం లేదని అంటున్నారు.
తాను ఆసుపత్రి ఫండ్స్ ఇన్చార్జ్ ని మాత్రమేనని తెలిపారు. ఆగస్టు 25న తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. నాడు కొంగరకలాన్ లో నూతన కలెక్టరేట్ భవన సమూదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉన్నానని తెలిపారు. తాను తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వస్తానని ఆయన వెల్లడించారు. తన సస్పెన్షన్ పై ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డాక్టర్ శ్రీధర్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. ఇక దీనిపై హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరీ.