పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ హీరోగా సినీ ప్రవేశంపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు తో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరు అడుగులకు పైగా ఉండే అకీరాను సినిమాల్లోకి రావాలని మెగా అభిమానులతో పాటు పవన్ అభిమానులు కూడా ఎక్కువగా కోరుతున్నారు. అయితే అతని తల్లి రేణుదేశాయ్ నిర్మించిన, దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో అతను కనిపించాడు.
సోలోగా ఎప్పుడు సినిమా చేస్తాడు అనేది మాత్రం స్పష్టత లేదు. అయితే తాజాగా అతను రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం అందడంతో సినిమా చేయడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యాడు. ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలని అదేవిధంగా అఖీరాను హీరోగా పరిచయం చేయాలని అతను భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన బాబాయ్ పవన్ కళ్యాణ్ వద్ద కూడా రామ్ చరణ్ ప్రస్తావించినట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వినాయక చవితి నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త దర్శకుడు తోనే సినిమా చేస్తాడా లేక పోతే మరో దర్శకుడితో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతను డాన్స్ కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ వద్ద అతను డాన్స్ నేర్చుకున్నాడట.