చిక్కుల్లో చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమా..!

చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమా గురించి ముందు నుండీ అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది. ఈ సినిమా క‌థ నాదే అంటూ చ‌ల్ల‌మ‌త్తు అనే ర‌చయిత..ర‌చ‌య‌త సంఘంలో ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికే శంక‌ర్ సినిమాల‌పై ప‌లు వివాదాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భార‌తీయుడు 2 సినిమా షూటింగ్ లో ప్ర‌మాదం జ‌ర‌గ‌టం వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొబ‌క్ష‌న్స్ కోర్టును ఆశ్రయించింది. శంక‌ర్ వ‌ల్ల‌నే సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డింద‌ని ఆరోపించింది.

ఇదిలా ఉండ‌గానే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అప‌రిచితుడు హిందీ రీమేక్ ను ర‌ణ్ వీర్ సింగ్ తో తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. దాంతో ఈ సినిమా క‌థ త‌మ‌దేన‌ని క‌థ‌కు హ‌క్కులు తామ సొంతం అని అప‌రిచితుడు సినిమాను తెర‌కెక్కించిన నిర్మాత..నిర్మాత‌ల సంఘాన్ని ఆశ్రయించారు. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప్ర‌క‌టించిన సినిమా వివాదంలో చిక్కుకుంది.