ట్రంప్ భార‌త్ ప‌ర్య‌ట‌.. అమెరికాకు భారత్ కు మధ్య తేడా ఇదేనంటున్న వర్మ..!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ట్రంప్‌’ వేదికకు వారు చేరుకోనున్నారు. భారత్‌కు ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి. దీంతో భార‌త్ ఈయ‌న ప‌ర్య‌ట‌కు ఎంతో ఖ‌ర్చు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రాకపై స్పందించారు. “డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికేందుకు మనం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అమెరికా వాళ్లు కనీసం వేల రూపాయలైనా ఖర్చు పెడతారా? ఇది భారత్ ను ప్రశ్నించడం కాదు, అమెరికా గురించి చెబుతున్నానంతే!” అంటూ వర్మ ట్విట్టర్ లో.. అమెరికాకు భారత్ కు మధ్య తేడా చెప్పుకొచ్చారు. రెండ్రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ట్రంప్ కు అట్టహాసంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ట్రంప్ కాలుమోపిన అహ్మదాబాద్ నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news