రెడ్: రామ్, మాళవిక లిప్ లాక్ సీన్ రిలీజ్ ..

రెడ్.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన మూడవ చిత్రమిది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే గతంలో చేసిన రెండు సినిమాలకి, ప్రస్తుతం థియేటర్లలోకి వస్తున్న రెడ్ సినిమాకి చాలా తేడా ఉంది. మొదటి రెండూ క్లాస్ సినిమాలు. రెడ్ మూవీ మాస్ యాక్షన్ థ్రిల్లర్. కరోనా కారణగా ఏడాది పాటు రిలీజ్ ఆలస్యం చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది.

తాజాగా ఈ సినిమా నుండి ఒకానొక వీడీయో బైట్ ని రిలీజ్ చేసింది. ఆ వీడీయో బైట్ ప్రేక్షకులని బాగా ఆకర్షించింది. అందుకు కారణం, హీరో రామ్, హీరోయిన్ మాళవిక ల మధ్య లిప్ లాక్ ఉండడమే. హీరో రామ్ గతంలో లిప్ లాక్ సీన్లు చేసినప్పటికీ, రెడ్ సినిమాలోది కాస్త ఇంటెన్స్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అటు మాస్ సీన్లతో పాటు ఇటు రొమాంటిక్ సీన్లు దండిగా ఉన్నాయని దీని ద్వారా తెలుస్తుంది. మాళవిక శర్మ తో పాటు నివేథా పేతురాజ్ మరో హీరోయిన్ గా కనిపిస్తుంది.