మా జిల్లా జోలికి రాకండి.. ఇలా ఉండనివ్వండి !

-

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో శ్రీకాకుళం జిల్లాని కలపవద్దని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కోరారు. జిల్లాల విభజన జరిగితే ఏమేం నష్టపోతామో వివరిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాను విభజిస్తానంటే అంగీకరించ లేదని ఆయన అన్నారు.

25 పార్లమెంట్ లకు 25 జిల్లాలు చేస్తామనే ఆలోచన అసంబద్ధ ఆలోచనలని రామ్మోహన్నాయుడు అన్నారు. అవసరం ఉన్న చోట మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా గానక విభజన జరిగితే దాని ఉనికి ఉపాధికి కూడా కష్టమేనని ఆయన అన్నారు. ఒకవేళ 2026 లో పునర్విభజనతో పార్లమెంటు స్థానాలు పెరిగితే అప్పుడు ఏం చేస్తారు ? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో చేస్తున్న ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news