లింగుస్వామితో రామ్ మూవీ ప్రకటన వచ్చేసింది..

Join Our Community
follow manalokam on social media

హీరో రామ్ మొన్న సంక్రాంతికి రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలనే భావనతో ఉన్నాడు ఆయన. గత కొద్దిరోజులుగా తమిళ దర్శకులతో చర్చలు జరపడంతో ఆయన వారితోనే సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే రామ్ ఇప్పుడు లింగుస్వామితో సినిమా అనౌన్స్ చేశాడు.

ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అధికారిక ప్రకటన వెలువడింది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ఒకే కాలంలో తెలుగు, తమిళ బాషలలో తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగులో యూ టర్న్, ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ సినిమాని తెరకెక్కిస్తున్న ఆయన ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కంటే ముందు లింగుస్వామి హవీష్ తో కూడా సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. మరి అది ఏమయిందో క్లారిటీ లేదు.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...