వరుస ఎన్నికలతో ఆ నేతలంతా ఆర్దిక ఇబ్బందుల్లో పడ్డారా

-

పంచాయితీ నుంచి పార్లమెంట్‌ దాకా ఎన్నికలంటే కాసులతోనే పని. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో పంచాయతీతో మొదలు పెట్టి, కార్పొరేషన్‌ వరకు ఎన్నికలన్ని ఒకేసారి వచ్చిపడ్డాయి.
వరుస ఎన్నికలు నేతల జేబుగుల్లచేస్తున్నాయట. అప్పెవరిస్తారా అని వెతుక్కుంటున్న నేతలు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందట..ఓ వైపు పంచాయతీ ఎన్నికలు, మరోవైపు మున్సిపల్ పోరు..రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.వరుస ఎలక్షన్లతో నేతలను ఆర్ధిక భాదలు వెంటాడుతున్నాయట…

ఎన్నికలంటేనే కాసులతో పని. స్థానిక ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా ఖర్చు మాత్రం కామన్‌.ప్రతి ఎన్నికా కీలకమే.. ప్రతి ఓటరూ ముఖ్యమే.ఇలాంటి సమయంలో ఏపీలో వరుసగా వస్తున్న ఎన్నికలు జేబుగుల్లచేస్తున్నాయని నేతల గగ్గోలు పెడుతున్నారట. ఎన్నికల మాటెత్తగానే నేతలు గల్లాపెట్టే తడుముకునే పరిస్థితి ఏర్పడుతోంది. జేబులు ఖాళీ అయితే విరాళాలు, చేబదుళ్లు, అప్పులు షరా మామూలే. వీటిలో లెక్కల్లో ఉండేవి కొన్నే.గ్రామ పంచాయతీ ఎన్నికలు చెప్పుకోవటానికి పార్టీల రహితంగా జరిగినా గ్రామ స్థాయిలో పట్టు నిరూపించుకోవాలంటే..పంచాయతీల్లో గెలుపు నేతలకు ప్రతిష్టాత్మకం.

ఇక పోటీ చేస్తున్న అభ్యర్ధుల కంటే ఎమ్మెల్యేలు, మంత్రులకే గెలుపు ఇజ్జత్ కా సవాల్‌ గా మారుతోంది. దీని కోసం ప్రత్యర్ధికి పట్టున్న గ్రామాల్లో అవసరమైతే ఓటుకు ఐదువేలు, పది వేలు ఇచ్చి అయినా..
ఓట్లు కొనాల్సి వస్తోందని ఇదంతా తలకు మించిన భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నేతలు. నియోజకవర్గంలో ఏ ఊర్లో ఓటమి పాలైనా అదో హాట్‌ టాపిక్‌. ఇక సొంత ఊర్లోనే పార్టీ సపోర్ట్‌ చేసిన అభ్యర్ధులు ఓడితే అది మరీ తలనొప్పి. మీడియాలో హెడ్‌ లైన్స్‌ లోకి ఎక్కడమే కాదు.. ప్రత్యర్ధుల ఆరోపణలకు అస్త్రంగా కూడా మారుతున్నాయి. దీంతో తలతాకట్టు పెట్టైనా ఖర్చు చేయాల్సిందేనని, తమ అభ్యర్ధులను గెలిపించుకోవలసిందేనని నేతలు భావిస్తున్నారు.

అయితే ఒక ఎన్నికైతే ఓకె. పంచాయతీల్లో ఏదో రకంగా డబ్బులు సర్దుబాటు చేసుకుంటే..ఇప్పుడు పుర పోరుకు సైతం నగారా మోగింది.మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరుగుతాయి.దీంతో అత్యధిక స్థానాల్లో జెండా ఎగరేయాల్సిన బాధ్యత ఆయా నేతల మీదే ఉంటుంది. మున్సిపాలిటీల ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
వీటి కోసం కూడా నాయకులు సంచులు రెడీగా ఉంచుకోవాలి.అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కరోనా కారణంతో పనులు పెద్దగా జరిగింది లేదు.నాలుగు రాళ్లు సంపాదించుకునే అవకాశం వచ్చిందీ లేదని నేతలు వాపోతున్నారట.

అసెంబ్లీ ఎన్నికలకు చేసిన అప్పులే ఇంకా తీర్చలేదని పంచాయతీ ఎన్నికలే తడిసి మోపెడవుతుంటే మిగతా వాటి పరిస్థితేంటని వాపోతున్నారట. ఎన్నికలన్నీ పూర్తయ్యే సరికి కోట్లల్లో ఖర్చు తేలే అవకాశం ఉందని ఒక్కో నేతా అంచనా వేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news