సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను, రోడ్ వెడల్పు బాధితుల, సమస్యలను అడిగి తెలుసుకున్నారు టిపిసిసి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత మస్తాన్ చేసిన సర్వే పచ్చి బూటకమని ఆగ్రహించారు.
మస్తాన్ అనే వ్యక్తి ఆర్ యస్ యస్ వ్యక్తి, అందువల్లే బీజేపీకి అనుకూలంగా రిపోర్ట్ అని.. ప్రజలెవరు ఇలాంటి నిరాధారమైన బోకస్ సర్వేలు నమ్మవద్దని సూచించారు. కేంద్రంలో బీజేపీ ని రాష్ట్రంలో టి ఆర్ ఎస్ పాలనను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని.. గ్రామాల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్యనే పోటీ అని చెప్పారు. బీజేపీ కి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులే కరువని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అని మండిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కేంద్ర, రాష్ట్రాలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తారన్నారు.