ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదంపై కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది… అయితే బెంచ్‌లో ఒకరైన జస్టిస్ లలిత్ ఉండటంపై సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో జస్టిస్ లలిత్ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో తదుపరి విచారణను జనవరి 29కి వాయిదా వేసింది. త్వరలోనే కేసులో కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. అయోధ్య కేసులో జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది కేసు విచారణ ప్రారంభం నాటి నుంచి ఏదో ఒక సాకుతో వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.