Rama Rao On Duty : మాస్ నోటీస్ ఇచ్చిన రవితేజ

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను మాస్ నోటీస్ పేరుతో ఓ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ వీడియో రవి తేజ మళ్ళీ దుమ్ములేపేశాడు. ట్రైలర్ న్ మించి పోయేలా ఈ వీడియో ఉంది. కాగా… ఈ సినిమా జూలై 29 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news