కోటంరెడ్డి శ్రీధర్ ట్యాపింగ్ ఆరోపణల్లో ట్విస్ట్

-

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్‌ ఒచ్చింది . అది ట్యాపింగ్‌ కాదు ఆడియో రికార్డింగ్ అంటూ మీడియా ముందుకొచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మిత్రుడైన రామశివారెడ్డి. కోటంరెడ్డి వినిపించిన ఆడియోలో అటు వైపు ఉన్న వ్యక్తే ఈ రామశివారెడ్డి. తనది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అని, తన ఫోన్‌లో ప్రతి కాల్‌ రికార్డ్‌ అవుతుందని తెలియచేసారు . ట్యాపింగ్‌ ఆరోపణలు, అసలు ఏం జరిగిందనేది పూర్తి వివరించారు. వేరొక కంట్రాక్టర్‌కు నా ఫోన్ నుంచి ఫార్వర్డ్ అయ్యిందన్నారు. తన ఫోన్ కేంద్ర హోంశాఖకు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి సిద్ధమే అని అన్నారు. కేవలం యాధృచ్చికంగా కాల్ రికార్డయింది. ఒక కాంట్రక్టర్ నా ఫోన్‌లోని వాయిస్ రికార్డును తీసుకున్నారు. నా ఫోన్‌లోనే రికార్డయిందని నేనే చెబుతున్నా.. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించులేదు అని వ్యక్తపరిచారు.

కోటంరెడ్డి చెబుతున్నట్లుగా ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు.. ఇది కేవలం రికార్డింగ్ మాత్రమే అని అన్నారు. మా ఇద్దరివీ ఐఫోన్‌లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నేను ఎవరో సీఎం జగన్‌కు అసలు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ ప్రచారం చేస్తున్నారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే సమాధానం చెప్పాలని వాస్తవాలు వెల్లడిస్తున్నాను. వైఎస్ కుటుంబంపై నాకు ఎనలేని విశ్వాసం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి అన్నారు.

 

ఇదిలావుంటే, ఎమ్మెల్యే కోటంరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందని ఆరోపించిన కోటంరెడ్డి ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేశారు. కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం.. వైసీపీ నేతల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇప్పుడు ఎంపీ.. రూరల్ కొత్త ఇంఛార్జ్ ఆదాల పైన మండిపడ్డారు. ఆదాల నామినేషన్ల ముందు రోజు వైసీపీలో చేరారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పును శిరసా వహిస్తానని చెప్పారు. పార్టీ శ్రేణులు తనతోనే ఉంటారనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఇటు కోటంరెడ్డి లక్ష్యంగా వైసీపీ నెల్లూరు రూరల్ లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి కౌంటర్ స్ట్రాటజీ అమలు చేపడుతున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version