విజయవాడ నగరంలోని స్వర్ణప్యాలెస్ లోని కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంకి సంబంధించి రమేష్ హాస్పిటల్ యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. హోటల్ నిర్వహణతో తమకు ఏ సంబంధం లేదు అని చెప్పడమే కాకుండా ప్రభుత్వం అనుమతి ఇస్తేనే తాము అక్కడ కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నామని రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటన చేసింది. ఎక్కువ మంది రోగులకు చికిత్స చేయాలనే తాము ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్యాలెస్ లో చికిత్స చేస్తున్నామని చెప్పింది.
అసలు హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను తమ ఆస్పత్రి తీసుకుంది నిర్వహించింది అని పేర్కొన్నారు. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రిని పూర్తిగా కరోనా కోసమే కేటాయించామని చెప్పింది. అక్కడ 30 పడకలే ఉన్నాయని పేర్కొంది. అందుకే ఈ విధంగా స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్నామని చెప్పింది.