గతంలో మార్గదర్శి చిట్ ఫండ్ ను నిర్వహించిన రామోజీ రావు మరియు ఎండీ శైలజా కిరణ్ లపై అందులో అవకతవకలు జరిగాయన్న విషయంపై CID కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రామోజీరావు A1 గా మరియు శైలజా కిరణ్ A2 గా ఉన్నారు. అయితే చాలా కాలంగా ఈ కేసు కొనసాగుతోంది. CID కి కూడా ఈ కేసులను పూర్తి చేయమని ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ కేసులో CID దూకుడు పెంచింది. కాగా కొద్ది రోజుల క్రితమే విచారణకు హాజరవ్వాలని ఇద్దరికీ CID నోటీసులు ఇచ్చింది.
అందులో భాగంగా కాసేపటి క్రితమే హైద్రాబాద్ లోని జూబిలీ హిల్స్ శైలజా కిరణ్ ఇంటికి అధికారులు వెళ్లి విచారణ చేస్తున్నారు. ఈమెను విచారించిన అనంతరం రామోజీరావు ను కూడా అధికారులు విచారించి కీలక విషయాలు రాబట్టనున్నారు. మరి ఈ రోజు విచారణలో ఏమైనా కీలక విషయాలు బయటకు వస్తాయా ? కేసు క్లోజ్ అయ్యే పరిణామాలు జరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది.