అఫీషియల్ : ‘రంగరంగ వైభవంగా’ జూలై1 న రానున్న వైష్ణవ్ తేజ్ ఫిల్మ్..

-

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే చక్కటి విజయాన్ని అందుకున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విడుదలైన ‘కొండ పొలం’ మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఈ క్రమంలోనే పంజా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం కొత్త దర్శకుడు గిరీశయ్యతో చేస్తుండగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఢిల్లీ భామ కేతిక ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, డిఫరెంట్ లవ్ స్టోరిగా ఈ సినిమా ఉండబోతున్నదని తెలుస్తోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన రొమాంటిక్ టీజర్, పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని తొలుత మే 27న విడుదల చేయాలనుకున్నారు. కానీ, తాజాగా తేదీ మార్చేశారు. జూలై 1న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రిషి, రాధా పాత్రలలో హీరో హీరోయిన్స్ నటించారు. పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో డాక్టర్ గా నటించారని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news