శ్రీలంక దేశ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. దీంతో శ్రీలంక దేశ 8వ కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
219 ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా అందులో రణిల్ విక్రమసింఘె ఏకంగా 134 ఓట్లు సాధించాడు. దీంతో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. ఆయన త్వరలోనే శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 8వ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె.. ఆ దేశ ప్రధానిగా పని చేశారు. మొన్ననే ఆ పదవికి రణిల్ విక్రమసింఘె రాజీనామా చేశారు. కాగా కొన్ని రోజులుగా శ్రీలంక లో క్రిసిస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.