ఈ నెలాఖరకు లాంచ్‌ కానున్న Google Pixel 6a.. ఇండియాలో ధర ఎంతంటే..

-

ఇండియన్‌ మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ధర రూ. 40 వేల లోపు ఉంటుందని అంచనా.. పిక్సల్‌ 5a తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. ఈ ఏడాది మేలో Google I/O ఈవెంట్‌లో Google Pixel 6aని ప్రకటించింది.. జులై చివరి నాటికి భారత్‌లో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Pixel 6a ధర :

పిక్సెల్ 6A ధరను గూగుల్ ట్విట్టర్‌లో వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం.. భారత మార్కెట్లో Pixel 6a ధర సుమారు రూ. 37వేలుగా ఉంది. ఈ డివైజ్ ధర రూ.40వేలుగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అందించనున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కెనడాలో Google Pixel 6a ధర (CAD 599) యూకేలో ఈ డివైజ్.. సింగిల్ 6GB వేరియంట్ ధర 459గా ఉంది. ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లలో ఈ డివైజ్ EUR 459 ధర ట్యాగ్‌ను కలిగి ఉంది. పిక్సెల్ 6a చార్‌కోల్ వేరియంట్ సింగపూర్, ఐర్లాండ్‌లలో అందుబాటులో ఉంటుందని నివేదిక వెల్లడించింది.

Pixel 6a స్పెసిఫికేషన్స్ ..

Pixel 6a ఫోన్.. గత ఏడాదిలో Pixel 6 ట్రిమ్-డౌన్ వెర్షన్. పిక్సెల్ 6కి పోలి ఉంటుంది. ఈ ఫోన్ పిక్సెల్ 6 నుంచి కెమెరా బార్‌ను తెచ్చుకుంది.
చాక్, చార్‌కోల్, సేజ్‌తో సహా మూడు కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.
Google ప్రీమియం ఫోన్లు-Pixel 6, Pixel 6 Proతో వచ్చింది.
పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్..
Pixel 6aలో సెల్ఫీల కోసం Pixel 6 మాదిరిగా అద్భుతమైన కెమెరాను అందించారు. పిక్సెల్ 6a లాంచ్ తేదీ ఈ నెలాఖరులో గూగుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.

ఈ ఫోన్‌ గురించి గత ఏడాది నుంచే ఎన్నో వార్తలు నెట్టింట వినిపించాయి. ఫోన్ లాంచ్‌ కాకముందే దాదాపు ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. ఎట్టకేలకు ఈ నెలఖారకు ఫోన్‌ లాంచ్ కానుంది. చూడాలి ఈ ఫోన్‌ కష్టమర్స్‌ను ఏమాత్రం ఆకట్టకుంటుందో..

Read more RELATED
Recommended to you

Latest news