రంజితమే..రంజితమే..పాటకు కడుపులో బిడ్డ స్టెప్పులు..వీడియో వైరల్..

-

రంజితమే..రంజితమే పాట గత కొన్ని రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది..తమిళ నటుడు విజయ్ నటించిన వారిసులోని ఈ పాట యూట్యూబ్‌ రికార్డులను కొల్లగొడుతోంది..సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీక్రియేషన్లే కనిపిస్తున్నాయి. ప్రముఖులు, యూట్యూబర్ లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, విజయ్ ఫ్యాన్స్, నెటిజన్లు… ఇలా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ రంజితమే పాటకు స్టెప్పులేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే రంజితమే పాటకు సంబంధించి ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది..

వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా రీల్స్ చేస్తూ పాటకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు..ఇది ఇలా వుండగా ఈ పాటకు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..ఈ హుషారైన పాటకు పుట్టబోయే బిడ్డ కూడా గెంతులు వేస్తోంది. రంజితమే సాంగ్‌ తమ ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకంగా నిలిచిందంటూ తమిళనాడుకు చెందిన ఓ ఫ్యామిలీ స్పెషల్ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో ఓ మహిళ బేబీ బంప్‌తో నవ్వులు చిందిస్తూ కనిపించింది. అయితే రంజితమే పాటను ప్లే చేయగా ఆమె కడుపులోని బిడ్డ గెంతులేస్తున్నట్లు కదలికలు కనిపిస్తున్నాయి. ‘రంజితమే సాంగ్‌ పెట్టిన ప్రతిసారీ నా బేబీ ఇలాగే డ్యాన్స్‌ చేస్తోంది” అంటూ ఆ మహిళ మురిసిపోయింది , కాగా ఈ వీడియోపై సంగీత దర్శకుడు తమన్‌ కూడా స్పందించాడు.

ఈ వీడియో చూస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నాను. నా రోజును ఇది ఎంతో సంతోషంగా మార్చేసింది’ అని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వారిసు సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజైంది. తెలుగు వెర్షన్‌ను మాత్రం జనవరి 14న విడుదల చేశారు..ఈ సినిమా లో పాట హైలెట్ అయ్యింది.. రష్మిక,విజయ్ ఈ పాటలో అద్బుతంగా నటించారు… ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news